గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అద్దంకిలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు

1 గంట క్రితం

addanki
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 04:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అద్దంకి : విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం అద్దంకి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎన్‌ఎస్‌పీ కాలనీలో రూ.7.72 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అద్దంకిలో రూ.2.25 కోట్లతో కొత్తగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని, రూ.75 లక్షల విలువైన అగ్నిమాపక వాహనాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్