ప్రజాశక్తి- కొత్తపేట: ప్రజాశక్తి దినపత్రిక 46 వ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ప్రజాశక్తి ఎప్పుడూ ప్రజా సమస్యలపై పోరాడే పత్రిక అని కొనియాడారు. 46 వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికలో ప్రజా సమస్యలు, అభివృద్ధిపై అద్భుతమైన ప్రత్యేక కథనాలతో, ఆకర్షణీయమైన కలర్ హంగులతో పాఠకులందరినీ ఆకట్టుకునేలా ఉందని కొనియాడారు. పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజాశక్తి విలేకరులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో కోనసీమ డివిజన్ ఆర్గనైజర్ కె.ప్రకాష్, కొత్తపేట, ఆలమూరు మండలాల విలేకరులు వాకాడ బాబులు, డి.గనిరాజు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడే పత్రిక ప్రజాశక్తి :ఎమ్మెల్యే బండారు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 03:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)