గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వినాయక నిమజ్జనానికి డీజే సౌండ్స్‌కు అనుమతి లేదు : ఎస్‌ఐ శివాజీ

1 గంట క్రితం

korukonda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 03:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – కోరుకొండ : వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్స్‌ వినియోగానికి ఎలాంటి అనుమతి లేదని కోరుకొండ ఎస్‌ఐ శివాజీ స్పష్టం చేశారు. నిమజ్జన కార్యక్రమాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్‌ఐ తెలిపారు. అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేయడం, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించడం చేయరాదన్నారు. నిమజ్జన సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు సహకరించాలని కోరారు. అలాగే నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనే వారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ శివాజీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్