బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్లు, ఫీజు రియంబర్స్‌మెంట్‌లను వెంటనే విడుదల చేయాలి

2 గంటల క్రితం

aisf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 12:11 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు మౌలిక వసతులు కల్పించాలి

జీవో నెంబర్ 77ను రద్దు చేయాలి

ప్రజాశక్తి, విజయనగరం కోట : పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్‌మెంట్‌లను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఫణీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం విజయనగరం పట్టణ కేంద్రంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కలెక్టరేట్‌కి ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫణీంద్ర కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్స్ మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని కోరారు. నాడు- నేడు పనులను పునః ప్రారంభించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ముందు పాదయాత్రలో ఏవైతే విద్యార్థులకు హామీ ఇచ్చారో వాటిని వెంటనే అమలు చేయాలన్నారు. తల్లికి వందనం సక్రమంగా అమలు కాకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థులకు మెస్ అర్జీలు 10 శాతం పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు భిక్షం వేస్తున్నారా అని మండిపడ్డారు. మీ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు లక్షల్లో జీతాలు పెంచుకుంటారు. విద్యార్థులకు ఏమో 10% మెస్ చార్జీలు పెంచుతారా అని మండిపడ్డారు. మీకు చిత్త శుద్ధి ఉంటే వెంటనే మెస్‌ చార్జీలను 40 శాతానికి పైగా పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టి అసెంబ్లీని ముట్టడిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. సుమన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గౌరీశంకర్ , ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు చరణ్, గణేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూర వాసు, ఏఎస్ఎఫ్ మన్యం జిల్లా కార్యదర్శి రవికుమార్ తో పాటుగా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


aisf


aisf-2


aisf-3

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్