ప్రజాశక్తి : కిర్లంపూడి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ బుధవారం కిర్లంపూడి వెళ్లనున్నారు. ముద్రగడ పార్థివదేహానికి ఆయన నివాళులర్పించనున్నారు. భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించే సమావేశం అనంతరం హెలికాప్టర్‌లో జగ్గంపేటకు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి వెళ్లనున్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు.
ముద్రగడకు నివాళులర్పించనున్న జగన్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 15, 2026, 12:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)