బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలని నగరపాలక సంస్థ ఎదుట ధర్నా

1 గంట క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 04:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ (సి ఐ టి యు) విజయనగరం కార్పొరేషన్ కమిటీ ఆద్వర్యంలో నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. జగన్మోహన్రావు మాట్లాడుతూ.. పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లు అయినా పే కమిషన్ వేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల భారం పెరుగుతుందని కార్మికుల వేతనాలు పెరగటం లేదన్నారు. పీఆర్సీ కమిషన్ వేసి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని, రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా ఐ ఆర్, హెచ్ ఐ ఆర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సేవలకు సన్మానాలు చేస్తున్నారు. అభినందనీయం. సన్మానాలతో కడుపు నిండదని, సమస్యలు పరిష్కరించాలన్నారు. పైసా ఇవ్వకుండా రిటైర్మెంట్ చేస్తున్నారు. రిటైర్మెంట్ అయిన మరణించిన, సిక్ కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వారికి రిటైర్మెంట్ బెనిఫిట్, వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. థర్డ్ పార్టీ, వర్క్ ఔట్ సోర్సింగ్ విధానం రద్దు చేయాలని, కార్మికులందర్ని పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం గాంధీ జయంతి అక్టోబర్ 2 న విజయవాడ లో సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా విభాగం కన్వీనర్ జి. కుమారి, జిల్లా కమిటీ సభ్యులు జి. రమా, నాయకులు రామ చంద్ర రావు, పైడి రాజు, చంద్ర రావు, రాఘవ , ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్