బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

12వ పిఆర్ సి కమిషన్ వెంటనే ప్రకటించి, ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ పి.ఆర్.సి జీతాలు చెల్లించాలి-సిఐటియు

58 నిమిషాల క్రితం

12వ పిఆర్ సి కమిషన్ వెంటనే ప్రకటించి, ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ పి.ఆర్.సి జీతాలు చెల్లించాలి-సిఐటియు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 05:41 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

మంగళగిరి రూరల్

​

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పి.ఆర్.సి కమిషన్ను ఏర్పాటు చేయాలని, మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ షి.ఆర్.సి జీతాలు చెల్లించాలని, డి.ఏ, మధ్యంతర భృతి (ఐ.ఆర్) కూడా అమలు చేయాలని, శాశ్వత స్వభావం కలిగిన పనులు చేస్తున్న మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, మున్సిపల్ రంగంలో 14 రకాల కీలకమైన విభాగాలను పిపిపి పద్ధతిలో ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎర్రబాలెం లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సిఐటియు రాజధాని డివిజన్ కార్యదర్శి బి లక్ష్మణరావు మాట్లాడుతూ 11వ పి.ఆర్.సి గడువు ముగిసి 6 ఏళ్ళు అవుతున్నా ఇంతరకు 12వ పి.ఆర్.సి కమిషన్ను ఏర్పాటు చేయకపోవటం కార్మికులు, ఉద్యోగులను మోసం చేయటమేనని విమర్శించారు. వెంటనే పి.ఆర్.సి కమిషన్ను ఏర్పాటు చేసి, జి.ఓ. ఆర్డి నెం. 1615 ప్రకారం మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ పి.ఆర్.సి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ రంగంలో ఔట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్న పనులన్నీ శాశ్వతమైన స్వభావం కలిగిన పనులని, శాశ్వత స్వభావం కలిగిన పనులలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టకూడదని చట్టాలు చెప్తున్నా పాలకులు చట్టాలను తుంగలోతొక్కి కార్మికులను చాలీ, చాలని వేతనాలతో శ్రమ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. అందుకే సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి మున్సిపల్ రంగంలోని కార్మిక సంఘాలు అన్నిటిని కలుపుకొని ఐక్యంగా ఉద్యమిస్తామని అన్నారు.మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ ఆపాస్ పోర్టల్ నందు ఉద్యోగి అని నమోదు చేయటం వల్ల ఎలాంటి సంక్షేమ పథకాలు వర్తించటం లేదని, దీనితో చాలీ, చాలనీ జీతాలతో పిల్లల చదువులు, కుటంబ సభ్యుల వైద్య ఖర్చులు, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అప్కాస్లో ఉద్యోగి అని నమోదు చేయటం వల్ల మేము నష్టపోతున్నామని, అందవల్ల ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చే వేతనాలు, ఇతర అలవెన్స్లు అన్నీ మాకు అమలు చేయాలని కోరారు.

​

యూనియన్ నాయకులు టి బాబు మాట్లాడుతూ కార్మికుల రేషన్కార్డులో పిల్లల పేర్లు కూడా నమోదు చేయటం లేదని అన్నారు. మా పిల్లల పేర్లు కూడా రేషన్కార్డులో నమోదు చేయకపోవటం అన్యాయమని, గత ప్రభుత్వం అనుసరించిన కార్మిక వ్యతిరేక విధానాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అనుసరిస్తుందని, విధానాలు మార్చుకోకపోతే మున్సిపల్ కార్మికులు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

​

ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆదిలక్ష్మి,దివ్య, కోటేశ్వరి, సుజాత, రామారావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్