బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఇసి జ్ఞానేష్ కుమార్ వైదొలగాలి - ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నిరసన ప్రదర్శన

1 గంట క్రితం

సిఇసి జ్ఞానేష్ కుమార్ వైదొలగాలి  
- ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నిరసన ప్రదర్శన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 05:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖపట్నం:

ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపును నిరసిస్తూ, సిఇసి జ్ఞానేష్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హాసిని వర్మ మాట్లాడుతూ, దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగాల్సి ఉండగా, ఎస్ఐఆర్ పేరుతో లక్షలాది ఓట్లు తొలగించే చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేగి వెంకటేష్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటు ప్రజల ప్రాథమిక హక్కు అని, ఎలాంటి చర్యల ద్వారా ఆ హక్కుకు భంగం కలిగించకూడదన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం జివిఎంసి నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీగా తరలి వెళ్లి మానవహారం నిర్వహించి కాంగ్రెస్ శ్రేణులు తమ నిరసన గళాన్ని వినిపించారు. మోడీ హటావో దేశ్ భావో, ఓట్ చోర్ గద్దె చోడ్ అంటూ ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో లక్కరాజు రామారావు, కె.వి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్