సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్టీసీ జేఏసి ఉద్యమ కార్యాచరణ యాదాతధం

2 గంటల క్రితం

rtc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 09:54 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఆర్టీసి జేఏసి కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పి.దామోదరరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్టిసి ఉద్యోగ సంఘాల జెఎసి డిమాండ్లపై యాజమాన్యం జరిపిన చర్చల్లో పురోగతి లేకపోవడంతో ఇప్పటికే ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ యధావిధిగా కొనసాగుతుందని జెఎసి కన్వీనర్లు కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పి.దామోదరరావు స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల జేఏసి డిమాండ్లపై చర్చించేందుకు ఎపిటిడిసి కమిషనర్, విసి అండ్‌ ఎండి ఎన్.బాలసుభ్రమణ్యం ఆద్వర్యంలో ఆర్టీసి ఉద్యోగ సంఘాల జేఏసి నాయకులతో సమావేశం సోమవారం సమావేశాన్ని ఆర్టిసి హౌస్‌‌లో నిర్వహించారు. సమావేశం అనంతరం జెఎసి కన్వీనర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టిసి అధికార్లతో జరిగిన సమావేశం మొక్కుబడి సమావేశమే తప్ప, సమస్యలు పరిష్కరించే సమావేశం కాదుని బావిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఆర్టీసిలో ప్రవేశపెట్టాలను కుంటున్న విద్యుత్ బస్సులను ప్రవేటు ఆపరేటర్లకు ఇవ్వకుండా ఆర్టీసి ద్వారానే కొనుగోలు చేసి, నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ బస్సుల పేరుతో మూసివేసిన విధ్యారపురం, గుంటూరు 2, నెల్లూరు 2, డిపోలు తెరిపించాలి, మంగళండిపోను ఖాళీచేయించకుండా నిలిపివేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే 750 ప్రెవేటు విద్యుత్‌ బస్సుల కోసం మరో 8 డిపోలలో 50 శాతం స్దలాలను కేటాయించే విదానం రద్దు చేయాలని, స్త్రీశక్తి పధకం ద్వారా ఇస్తున్న జిరో టికేట్లకు, ఇతర రాయితీలకు డబ్బులు పుర్తిగా ప్రతినెలా చెల్లించాలని, స్త్రీశక్తితో పెరిగిన ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా వెంటనే 4 వేల బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసిలో అన్ని కేటగిరులలో ఖాళీగా ఉన్న సుమారు 12 వేలు పోస్టులు భర్తిచేయాలని, స్త్రీశక్తి పధకం అమలులో సిబ్బంది, మహిళాప్రయాణీకులు ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బస్సులు చాలక ప్రయాణీకులను ఎక్కించుకోలేని పరిస్థితుల్లో విధి నిర్వహాణలో ఉన్న సిబ్బందిపై దాడులు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకొవాలని కోరగా, ఈ అంశాలపై యాజమాన్యం చర్చించినట్లు తెలిపారు. ఔట్ సోర్శింగు ఉద్యోగులజీతాలు, పదోన్నతులు, ఖాళీ క్యాడర్ పునర్వ్యవస్థీకరణ సమస్యలు, నిర్వహణ ఉద్యోగుల సమస్యలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలు, సంక్షేమ అంశాలు, డిపోలలో నెలకొన్న పరిపాలనా సమస్యలు, సిబ్బంది కొరతతో వస్తున్న పని ఒత్తిడి తదితర అంశాలపై సమగ్రంగా చర్చ జరిగిందని కన్వీనర్లు తెలిపారు. ఈ సమావేశంలో జెఎసి ప్రస్తావించిన డిమాండ్లలో ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలు అన్ని ప్రభుత్వం దృష్టికీ తీసుకొని వెళ్తామని, ఆర్టీసి పరిధిలో ఉన్న మిగిలిన అంశాలపై త్వరలో మరోక సమావేశం నిర్వహిస్తామని యాజమాన్యం హామి ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం జేఏసీ పోరాటం నిరంతరం కొనసాగుతుందనీ వారు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్టీసి కో-కన్వీనర్లు పి.వి.రమణారెడ్డి, జి.వి.నరసయ్య, సి.హెచ్.సుందరయ్య, యస్.కె. జిలాని, యస్.వి.శేషగిరిరావు, వై.శ్రీనివాసరావు, కె.సూర్యప్రకశరావు, డి.మాల్యాధ్రీ తోపాటు ఎన్‌ఎంయుఎ, ఇయు రాష్ట్ర నాయకులు కె.శ్రీనివాసరాజు, యస్.రాజేష్ కుమార్, పి.సుబ్రమణ్యంరాజు, ఎం.డి వై ప్రసాద్‌ వై.యస్.రావు ‌తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్