మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహిళలకి నష్టం చేసే కేంద్ర, రాష్ట్రప్రభుత్వ విధానాలపై రాష్ట్ర వ్యాపిత ఉద్యమాలు

13 గంటల క్రితం

vzm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 03:27 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

స్త్రీ శక్తి పథకాన్ని పకడ్బందిగా అమలు చేయాలి : జిల్లా సదస్సులో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి సావిత్రమ్మ పిలుపు

ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాల విధానాలు వలెనే మహిళలు తీవ్ర ఇబ్బందులకి గురవు తున్నారని, రాష్ట్రంలో అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని పకడ్బందిగా అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి సావిత్రమ్మ అన్నారు. మంగళవారం ఎల్ బి జి భవన్ లో జరిగిన ఐద్వా జిల్లా సదస్సు లో ముఖ్య అతిధిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి పి. రమణమ్మ అధ్యక్షతన జరిగిన సదస్సు లో ఆమె మాట్లాడుతూ.. దేశంలో మోడీ ప్రభుత్వం అయిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులుధరలు పెంచి మహిళలు పై పెను బారాలు మోపుతోందని అన్నారు. రాష్ట్రములో మహిళలు కిచ్చిన హామీలు అమలు చేయక పోగా మద్యంను బెల్ట్ షాప్ లు ద్వారా విపరీతంగా అమ్ముతున్నారని, గంజాయి, మత్తు పదార్ధాలుకి అడ్డా గా ఆంధ్ర ప్రదేశ్ మారిపోయిందని అన్నారు. మరో వైపు మహిళలుపై హత్యలు, అత్యా చారాలు రోజు రోజు కి పెరిగి పోతున్నాయని, మహిళలుకి రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇప్పుడు ఏకంగా విశాఖ బీచ్ లో మద్యం షాపులు పెడతామని విచ్చాలవిడిగా యువత తాగు బోతులుగా మారాలాని చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తోందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టి ఐద్వా పోరాడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యవసర సరుకులు ధరలు పెరిగిపోతున్నాయి, వాటిని తగ్గించాలన్నారు. ఆగస్టు 31 న అక్టోబర్ 4 తేదీ వరకు 5 లక్షలు సంతకాలు సేకరణ చేపడుతున్నామన్నారు. దళారీ వ్యవస్థను కట్టడి చేయాలన్నారు. బియ్యం,వంట నూనె లు ,కంది పప్పు వంటి సరుకులు ధరలు పెరిగిపోతున్నాయి. ప్రజా పంపిణీ.ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సామాన్య మధ్య తరగతి ప్రజలు పెరిగిన కూరగాయలు ధరలు వలన అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహిళా స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు పకడ్బందిగా అమలు చేయాలని కోరారు. మహిళలు పై హేళనగా మాట్లాడే పరిస్తితి ఆర్టీసీ సిబ్బంది చేస్తున్నారన్నారు. డ్రైవర్లు, కండక్టర్లకు మహిళలతో వ్యవహరించే విషయంలో అవగాహన కల్పించాలని కోరారు. జనాభా తగ్గట్టుగా బస్సులు పెంచాలని డిమాండ్ చేశారు. బస్ స్టాప్ లు తగ్గించటం సరికాదన్నారు. బస్సు స్టాప్ లు పెంచి బస్సులు ఆపే విధంగా చూడాలనీ కోరారు. అన్ని సచివాలయాల్లో.వినతి పత్రాలు, డిపో మేనేజర్లకు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతరం ఐద్వా రాష్ట్ర సహాయ సహాయకార్యదర్శి సత్యవతి సదస్సులో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లాఅధ్యక్షులు పుణ్యవతి కోశాధికారి లక్ష్మి, సహాయ కార్యదర్శి జి. పుణ్యవతి మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్