ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సినిమా రంగంలో ఉపాధికి కృషి

13 గంటల క్రితం

సినిమా రంగంలో ఉపాధికి కృషి 
- ఎపి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మంథా శ్రీనివాస్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 09:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మంథా శ్రీనివాస్

ప్రజాశక్తి - ఎన్‌‌టిఆర్ జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో సినిమా నిర్మాణాలకు అనుకూల వాతావరణం కల్పించి, స్థానికులకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం ఛాంబర్ ఆఫ్‌ ‌కామర్స్‌ అధ్యక్షులు మంథా శ్రీనివాస్ తెలిపారు. విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో శనివారం 24 క్రాఫ్ట్స్ యూనియన్ల ప్రతినిధుల సమావేశం జరిగింది. విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, తిరుపతి, అరకు, లంబసింగి, భవానీ ఐలాండ్ వంటి ప్రాంతాలను ప్రధాన షూటింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, షూటింగ్‌లకు వచ్చే నిర్మాతలకు ప్రభుత్వ అనుమతులు, రాయితీలపై సమగ్ర సమాచారం అందించాలని నిర్ణయించారు. స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం, ప్రైవేటు పెట్టుబడులకు కృషి చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా మంథా శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుని సినిమా నిర్మాణాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతోపాటు స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులు, సినీ కార్మికులకు విస్తృత స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు, ప్రభుత్వ శాఖలు, సినీ నిర్మాతలు, దర్శకులు, వివిధ యూనియన్ల ప్రతినిధుల మధ్య సమన్వయానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్‌ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం.ప్రసన్నకుమార్ వర్మ, లక్కరాజు రాధా రాజేశ్వరి మాట్లాడుతూ... 24 క్రాఫ్ట్స్ యూనియన్ల కార్మికులకు ఉచిత సభ్యత్వ గుర్తింపు కార్డులు, ఉచిత వైద్య బీమా సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ప్రధాన కార్యదర్శి వికె.రమేష్ మాట్లాడుతూ.. చిన్న సినిమాలు, నూతన నిర్మాతలు, యువ దర్శకులకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ తోట ఆంజనేయులు, వివిధ జిల్లాల అధ్యక్షులు ఎ.కృష్ణచౌదరి (గుంటూరు), ఎస్. అయ్యప్పనాయక్ మీనావత్ (కృష్ణా), చప్పిడి సత్యనారాయణ (పశ్చిమ గోదావరి), తిరుపతి శోభారాణి (చిత్తూరు), స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మట్టా లావణ్య, ఉప్పాల రాజ్ కిరణ్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్