గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడలో విద్యార్థి సంఘాల నిరసన ఉద్రిక్తత

2 గంటల క్రితం

police
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 02:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విజయవాడలో విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. లోక్ భవన్ లో గవర్నర్ కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు మార్గం మధ్యలో అడ్డుకున్నారు. దీంతో బందర్ రోడ్డుపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. లోక్ భవన్ కు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన పోలీసులు మాట తప్పి తమపై దాడి చేశారని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మఫ్టీలో ఉన్న పోలీసు విద్యార్థులాతో నిరసనలో తమతోపాటు పాల్గొని, మెడను కండువాతో నొక్కడంపై వారు మండిపడ్డారు. పోలీసుల దాడిలో పలువురు నాయకులకు గాయాలైయ్యాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్