గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

111 మంది ఎంపిలు, ఎమ్మెల్యేలు పార్టీలు మారారు

1 గంట క్రితం

jump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 12:59 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఫిరాయింపులను ప్రోత్సహించిన ఎన్‌పిఎఫ్‌, బిజెపి

- ఎడిఆర్‌ నివేదిక

న్యూఢిల్లీ : 2022 నుంచి ప్రస్తుత లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన వారిలో 111 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరారు. వారిలో 81 మంది (73%) ఎన్‌పిఎఫ్‌, బిజెపి, ఎన్‌సిపిఐ పార్టీలలోనే చేరారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్‌), నేషనల్ ఎలక్షన్ వాచ్ నిర్వహించిన విశ్లేషణ ప్రకారం, వీరిలో 26 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు, 78 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు. వారిలో 64 మంది (58%) పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ను విడిచిపెట్టి నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి)లో చేరి కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి, బిజెపికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అత్యధిక సంఖ్యలో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను చేర్చుకున్న పార్టీలలో నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్‌) 32 మందితో (29%) అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో బిజెపి 29 మందితో (26%), నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సిపిఐ) 20 మందితో (18%) ఉన్నాయి. 2022 - 2026 మధ్య సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల ఆధారంగా ఈ నివేదికను ఎడిఆర్‌, నేషనల్‌ ఎలక్ష‍న్‌ వాచ్‌ రూపొందించాయి. అత్యధిక సంఖ్యలో పార్టీ మారిన ప్రజాప్రతినిధులు మొదట ఎన్‌డిపిపి నుండి ఎన్నికైనవారు (25 మంది, 23%), ఆ తర్వాతి స్థానాల్లో తృణమూల్ (20 మంది, 18%), కాంగ్రెస్ (19 మంది, 17%) ఉన్నాయి. భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) నుండి తొమ్మిది మంది (8%) పార్టీ మారగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నుండి ఏడుగురు చొప్పున (6%) మారారు. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నుండి ఆరుగురు (5%), జనతాదళ్ (యునైటెడ్) నుండి ఐదుగురు (5%) మరియు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) నుండి నలుగురు (4%) పార్టీ మారారు. కొన్ని రాష్ట్ర అసెంబ్లీలలో ఇటీవల ప్రభుత్వాలు పడిపోవడానికి ఆయా పార్టీల ఎమ్మెల్యేలు ఫిరాయించడమే కారణమని ఆ నివేదిక పేర్కొంది.

అత్యధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకున్న పార్టీల్లో నాగ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్‌) అగ్రస్థానంలో నిలిచింది. 32 మంది, 29% మందిని చేర్చుకుంది. ఆ తర్వాత బిజెపి (29 మంది, 26%), నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సిపిఐ) (20 మంది, 18%) ఉన్నాయి. కాంగ్రెస్ తొమ్మిది మందిని (8%), శివసేన ఎనిమిది మందిని (7%), ఎన్‌పిపి ఆరుగురిని (5%), పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ నలుగురిని (4%) తమ పార్టీలో చేర్చుకున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్