సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

చలో తర్లువాడ ఉద్రిక్తత

1 గంట క్రితం

calo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 12:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వామపక్ష నేతల అరెస్ట్

- జన ఆవాసాల మధ్య డేటా సెంటర్లు రద్దు చేయాలి

- వామపక్ష నాయకులు డిమాండ్

ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్ : జన ఆవాసాల మధ్య డేటా సెంటర్లు ఏర్పాటు చర్యను విరమించాలని డిమాండ్ చేస్తూ, సోమవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చలో తర్లువాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డగించి, వామపక్షాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు వ్యతిరేకించిన డేటా సెంటర్లను విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలోని టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల పర్యావరణానికి, విశాఖ ప్రజలకు, వన్యప్రాణులకు నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికే విశాఖలో తాగునీటి కొరత, అధిక ఉష్ణోగ్రతలు, విద్యుత్ వినియోగం పై అదనపు భారం పడే పరిస్థితి తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అనందపురం మండలం తర్లువాడ గ్రామానికి ఈరోజు పర్యటన నిర్వహిస్తున్నామన్నారు. తర్లువాడ గ్రామంలో రైతులు దళితుల నుంచి ప్రభుత్వం బలవంతంగా 262 ఎకరాల భూమిని గుంజుకుంది అన్నారు. భూములు కోల్పోయిన 520 మంది రైతులకు, 50 మంది దళితులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదన్నారు. రైతులను దళితులను మోసం చేసి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధంగా చంద్రబాబు, మోడీ ప్రభుత్వాలు వివరిస్తున్నాయని ఆరోపించారు. ఈ విధ్వంసకర నిర్ణయాలను నిలిపివేసి, పర్యావరణాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. తర్లువాడ గ్రామంలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నా అనంతరం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె రహిమాన్ మాట్లాడుతూ డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల విశాఖ జిల్లాలో రెండు ప్రాంతాలు, అనకాపల్లి జిల్లాలో ఒక ప్రాంతంలో పర్యావరణ విధ్వంసం జరిగే ప్రమాదం ఉందన్నారు. అడవివరం ప్రాంతంలో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. విశాఖలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ఇటువంటి ప్రాజెక్టులు వల్ల పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్నారు. డేటా సెంటర్ ఏర్పాటుతో మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితి తలెత్తుతుందన్నారు. ఇప్పటికే మంచినీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. డేటా సెంటర్ వస్తే తాగునీటి సమస్య మరింత తీవ్రతరం అయ్యే వీలుందన్నారు. డేటా సెంటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ బి.గంగారావు, వి.కృష్ణారావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి. చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. మన్మధరావు, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఎ. విమల, జిల్లా అధ్యక్షురాలు ఎం.ఎ బేగం,ఎస్ యుసిఐ జిల్లా కన్వీనర్ గోవిందరాజులు, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి దేవ సహాయం, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు యు. ఎస్.ఎన్ రాజు,యు. నాగరాజు, కె. అచ్యుతరావు, జి. రాంబాబు, వై. రాంబాబు, సిపిఎం నాయకులు ఎల్.జె నాయుడు, నరేంద్ర, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.


వామపక్ష నేతల అరెస్ట్

ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో గూగుల్ డేటా సెంటర్ భూ సమస్యలపై రైతులను కలిసేందుకు వెళ్తున్న సీపీఎం, సీపీఐ తదితర వామపక్ష పార్టీల నాయకులను పోలీసులు సోమవారం మార్గమధ్యంలో అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్లివాడలో సమావేశం నిర్వహించకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. నాయకులను స్టేషన్‌కు తరలించడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై వామపక్ష నాయకులు పోలీసుల చర్యను ఖండిస్తూ, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.

అరెస్ట్

అరెస్టు


arrestసిపిఎం నేత గంగారావును అరెస్టు చేస్తూ...



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్