ప్రజాశక్తి - చింతూరు (పోలవరం జిల్లా) గోదావరి, శబరి వరదల వల్ల తాము పడుతున్న కష్టాలు, బాధలు వర్ణనాతీతమని, తక్షణమే పరిహారం, పునరావాసం కల్పించి ఆదుకోవాలని కోరుతూ పోలవరం జిల్లా చింతూరు మండలం కుయుగురు గ్రామస్తులు శుక్రవారం వారి గ్రామంలో వరద నీటిలో జలదీక్ష చేపట్టారు. వరదతో ప్రతి ఏటా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. చిన్నపాటి వరదకే తమ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంటోందని, అయినప్పటికీ పోలవరం ముంపులో తమ గ్రామాన్ని 45వ కాంటూరులో కలపడం బాధాకరమని ఆవేదన చెందారు. 41వ కాంటూరులో చేర్చి తక్షణమే పరిహారం, పునరావాసం కల్పించాలని కోరారు. తమ గ్రామ రహదారి జలమయమైతే రాకపోకలు నిలిచిపోతున్నాయని, రోగులు, గర్భిణులు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరద కష్టాల నుంచి తమను రక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
‘పోలవరం’ పరిహారం కోసం జలదీక్ష
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 08:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)