బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బోనస్ చెల్లించాలని ‘ఉక్కు’ కార్మికుల ధర్నా

06 అక్టోబర్, 2026

బోనస్ చెల్లించాలని ‘ఉక్కు’ కార్మికుల ధర్నా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 09:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం): విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు తక్షణమే బోనస్‌ చెల్లించాలంటూ స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (‌సిఐటియు) ఆధ్వర్యాన ఉక్కు ప్రధాన పరిపాలనా భవనం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమా నుద్దేశించి సంఘం ప్రధాన కార్యదర్శి జె.అయోధ్యరామ్‌ మాట్లా డుతూ మూడు దశాబ్దాలపాటు ఎన్‌జెసిఎస్‌ ద్వారా స్టీల్‌ కార్మికులకు బోనస్‌ ప్రకటించి, విశాఖ స్టీల్‌లోనూ అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రెండేళ్లుగా స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్య వైఖరి, గుర్తింపు యూనియన్‌ వైఫల్యం కారణంగా ఉక్కు కార్మికులు బోనస్‌ కోల్పోయారని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఎన్‌జెసిఎస్‌లో భాగస్వామిగా ఉన్నందున, అక్కడ కుదిరిన ఒప్పందాలను ఇక్కడ కూడా అమలు చేసినప్పుడే భాగస్వామ్యం అనే పదానికి అర్థం ఉంటుందని తెలిపారు. రెండేళ్లుగా యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉక్కు కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సెయిల్‌లో అమలవుతున్న బోనస్‌ను విశాఖ ఉక్కు కార్మికులకు కూడా తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సంఘం అధ్యక్షులు యు.రామస్వామి మాట్లాడుతూ... స్టీల్‌ ‌ప్లాంట్‌‌కు శాశ్వత ఉన్నత స్థాయి యాజమాన్యాన్ని ప్రభుత్వం నియమించడం ద్వారా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల భద్రతకు సంబంధించి ఉపశమనం కలుగుతుందన్నారు. ధర్నాలో సంఘం నాయకులు టివికె.రాజు, బిఎన్.మధుసూదన్‌, మరిడయ్య, పట్టా రమేష్‌, బి.మహేష్‌, దేముడు నాయుడు, శ్రీనివాసరెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్