శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌ రాజీనామా చేయాలని ధర్నా

6 గంటల క్రితం

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌ రాజీనామా చేయాలని ధర్నా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 08:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​.ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం

కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా మారి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ‌ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ను తక్షణమే రాజీనామా చేయాలని కోరుతూ రైల్వేగూడ్స్‌ షెడ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన కార్మికులు నిరసన తెలిపారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ ప్రతినిధులు సత్తి కోదండరామిరెడ్డి, చిర్ల పుల్లారెడ్డి, కర్రి సాయిరెడ్డి మాట్లాడారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ప్రధాన ఎన్నికల కమిషన్‌ను ప్రధాని మోడీ, కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా తమ జేబు సంస్థగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు కర్రి శ్రీనివాస్‌ రెడ్డి, బుద్దాల నాని, కర్రి సుబ్బిరెడ్డి, ఆడప ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్