ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భారతి, షర్మిలను కించపరిచేలా వ్యఖ్యలు చేసిన వారిపై చర్యలు

13 నవంబర్, 2026

cpi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 09:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా మాజీ సిఎం వైఎస్ జగన్ సతీమణి భారతి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అసభ్య పదజాలంతో కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ‌ఘటన నేపథ్యంలో ఆయనకు సంఘీభావం పేరుతో నిర్వహించిన ‘ఎక్స్’ స్పేస్ చర్చలో కొందరు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై అత్యంత నీచమైన భాషలో వ్యక్తిగత దూషణలకు దిగడం, మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడం దారుణమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత కొంతకాలంగా హుందాతనంగా ఉండాల్సిన రాజకీయ వ్యవస్థ దిగజారిపోతోందని, అధికార, ప్రతిపక్ష పార్టీల అనుచరగణం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నేతల కుటుంబ సభ్యులను దూషిస్తూ అసభ్య పదజాలంతో విమర్శించడం అవివేకమన్నారు. రాజకీయాల్లో విమర్శలు రాజకీయ కోణంలోనే ఉండాలని, వ్యక్తిగతంగా ఉండకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలను కించపరిచే స్థాయిలో ఏ పార్టీ నాయకులకు, కార్యకర్తలకూ ఉండకూడదని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్