విజయవాడ : బుడమేరు ముంపు నివారణ చర్యలు చేపట్టాలని, నిధులు కేటాయించాలని కోరుతూ .... సిపిఎం సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో బుడమేరు వంతెన వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. బుడమేరు ముంపు వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం నివారణ చర్యలు, నిధులు కేటాయించడంలో పూర్తి వైఫల్యం చెందిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి బి.రమణ, నగర కార్యదర్శి వారికి సభ్యులు కే.దుర్గారావు, టి.ప్రవీణ్, నగర కమిటీ సభ్యులు ఎం. సోమేశ్వరరావు, వై. సుబ్బారావు, పీరు, గురుమూర్తి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.










కామెంట్‌లు (0)