ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 3వ తేది నుంచి ప్రారంభం కానుంది. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా అధ్యక్షతన అడ్మిషన్ల కమిటీ సమావేశం సోమవారం జరిగింది. మంగళవారం అడ్మిషన్ల ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కమిటీ నిర్ణయించింది. ఈ నెల 3 నుంచి 9వ తేది వరకు అభ్యర్ధులు రిజ్రిస్టేషన్, ఫీజుల చెల్లించేందుకు అవకాశం కల్పించింది. 4 నుంచి 9వ తేది వరకు సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించనుంది. 15వ తేదీ ప్రాధమిక మెరిట్ జాబితా విడుదల చేసి 18వ తేదిన అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించింది. 19 నుంచి 21వ తేది వరకు వెబ్ ఆప్షన్ల ఎంపికకు, 22వ తేది ఆప్షన్లు మార్చుకునే వెసులు బాటు అభ్యర్ధులకు ఉంది. 24వ తేదిన సీట్ల అలాట్‌మెంట్ విడుదల చేయనుంది. 25 నుంచి తరగతులను ప్రారంభించనుంది. 25 నుంచి 29వ తేది వరకు అభ్యర్ధులు కళాశాలల్లో రిపోర్టు చేసే అవకాశం కల్పించింది.
ఎల్లుండి నుంచి ఆర్కిటెక్చర్ అడ్మిషన్ల కౌన్సిలింగ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 31, 2026, 11:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)