- చుట్టుగుంటలో ఎగిసిపడుతున్న మంటలు
విజయవాడ: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని చుట్టుగుంట ప్రాంతంలోని టింబర్ డిపోలో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.







కామెంట్‌లు (0)