- నేడు బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అమ్మవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. నేడు శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆలయ చైర్మన్, ఈవో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని దర్శన క్యూలైన్లలో ఉచిత దర్శనానికి ఏర్పాట్లు చేశారు. నూతన పూజా మండపంలో కుంకుమార్చన పూజలు ప్రారంభమయ్యాయి. యాగశాలలో శాస్త్రోక్తంగా చండీ హోమం ప్రారంభ పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు సౌకర్యవంతంగా అమ్మవారి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.








కామెంట్‌లు (0)