మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు

1 రోజు క్రితం

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 04:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- వ్యకాస, కెవిపిఎస్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో ​: ​రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సోమవారం నాడు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి లోకనాధం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి తెలిపారు. సామాజిక శంఖారావం, కులవివక్ష లేని సమాజం కోసం చేపట్టిన అధ్యయన యాత్రల్లో 26 జిల్లాలు, 380 మండలాలు, 1,243 గ్రామాలు, 63 పట్టణాలు, 236 వార్డుల్లో దళితుల సమస్యలను గుర్తించినట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో 660 శ్మశాన వాటికలు, 405 ఇళ్ల స్థలాలు, 302 భూ సమస్యలు ఉన్నాయని తెలిపారు. ప్రతి దళితవాడకు జిఓ 1235 ప్రకారం శ్మశాన వాటికలు ఏర్పాటు చేసి, ఆక్రమణలు తొలగించాలని కోరారు. దళితులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు, ఆక్రమిత భూములను తిరిగి బాధితులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికీ ఇంటి స్థలం, ఇంటి పట్టా ఇచ్చి, ఇల్లు నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. అధ్యయన యాత్రల్లో గుర్తించిన ప్రతి సమస్యపై జిల్లాలవారీ ప్రత్యేక సమీక్ష నిర్వహించి, కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. సోమవారం నాడు జరిగే ధర్నాల్లో దళితులు, గిరిజనులు, కార్మికులు, రైతులు, మహిళలు, యువత, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్