మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

'సోలార్` భూ దోపిడిని అరికట్టాలి

1 రోజు క్రితం

rythu sangham
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 09:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపి రైతు సంఘం డిమాండ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సౌర కేంద్రంగా రాయలసీమ పేరుతో రైతుల భూములు సోలార్ కంపెనీలకు కట్టబెట్టొద్దని ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు వి.కృష్ణయ్య, వి.ప్రభాకర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ​రానున్న మూడేళ్లలో 50వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా రాయలసీమలో వివిధ జిల్లాల్లో సోలార్ ప్రాజెక్టులు నిర్మించన్నుట్లు ప్రకటించారని తెలిపారు. కర్నూలు, తిరుపతి, కడప జిల్లాల్లో సుమారు రూ. 25 వేల కోట్ల పెట్టుబడులతో సోలార్ పరిశ్రమలు ఏర్పాటు చేసి 8 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు టిడిపి సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో కంపెనీ రూ.25వేల కోట్లతో 4వేల ఎకరాలలో హైడల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభం కాబోతోందని తెలిపారు. ఈ సోలార్ ప్రాజెక్టులలో రూ. 40 వేల కోట్లు ఖర్చు పెడితే 4వేల మందికి కూడా ఉద్యోగాలు రాలేదని గుర్తు చేశారు. గత అనుభవాలు ఒకరకంగా ఉంటే టిడిపి ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయని విమర్శించారు. పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో రైతుల భూములను కొల్లగొట్టే సోలార్ కంపెనీలకు కారుచౌకగా కట్టేబెట్టే ప్రయత్నాలు మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్