గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

1 రోజు క్రితం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
- విజయవాడలో గంటన్నరసేపు నిలిపివేత image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 10:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- విజయవాడలో గంటన్నరసేపు నిలిపివేత

​ప్రజాశక్తి - విజయవాడ సిటీ : చెన్నై నుంచి నర్సాపూర్ వెళ్తున్న వందే భారత్ (20678) ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన లోకో పైలట్, రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ రైల్వేస్టేషన్‌‌లో ప్లాట్‌‌ఫారమ్‌ ‌పైకి చేరుకుంటున్న సమయంలో చక్రాల వద్ద గల హాట్ యాక్సిల్ ప్రాంతం నుంచి ఒక్కసారిగా మంటలు రావడాన్ని స్టేషన్ సిబ్బంది గమనించారు.అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. చక్రాల యాక్సిల్ విపరీతంగా వేడెక్కడం లేదా బ్రేక్ బైండింగ్ కారణంగా ఘర్షణ పెరిగి మంటలు వచ్చినట్లు రైల్వే సాంకేతిక నిపుణులు ప్రాథమికంగా గుర్తించారు. ఊహించని పరిణామంతో ప్రయాణికులతోపాటు ప్లాట్‌ఫారమ్‌పై వేచి ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మరమ్మతుల నిమిత్తం విజయవాడ స్టేషన్‌లోనే దాదాపు గంటన్నర పాటు రైలును నిలిపివేశారు. ప్రయాణికులను మరో రైలులో పంపించారు.

​

​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్