మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

​896 వసతి గృహాల్లో సరిగ్గా లేని మరుగుదొడ్లు

5 గంటల క్రితం

hosterl
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 12:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 2.65 లక్షల మంది చిన్నారులకు వైద్య పరీక్షలు

- వైద్యారోగ్యశాఖ మంత్రికి అధికారుల నివేదిక

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో​ : రాష్ట్రంలోని 896 వసతి గృహాల్లో మరుగుదొడ్ల నిర్వ‌హ‌ణ‌ సరిగ్గా లేదని, 14 చోట్ల మరుగుదొడ్లు అందుబాటులో లేవని అధికారులు నివేదించారు. తుపానుల అనంతరం ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు వైద్య బృందాలు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఈ నెల 1 నుంచి 13వ తేదీ ‌వరకు 2,148 వసతి గృహాల్లోని 2,65,556 మంది విద్యార్థులకు జ్వరాలు, రక్తహీనత, చర్మ, శ్వాసకోశ, ఇతర ఆరోగ్య సమస్యలపై పరీక్షలు జ‌రిగాయని ఆ శాఖ మంత్రి సత్యకుమార్‌ ‌యాదవ్‌‌కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కెవిఎన్‌ చక్రధర్‌బాబు, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ ఆర్‌ వెంకటరమణ సోమవారం నివేదిక అందజేశారు. ఈ పరీక్షల్లో 4,436 మంది పిల్లలకు చర్మ వ్యాధులు ఉన్నట్లు గుర్తించారు. 961 మందికి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, 2,750 మందికి దంత సమస్యలు, 85 మందికి అతిసార వ్యాధులు ఉన్నట్లు వెల్లడైంది. మలేరియా 14, టైఫాయిడ్‌ 8 కేసులు నమోదయ్యాయి. 3,218 మంది పిల్లల్లో రక్తహీనత, మరో 1,842 మందికి ఇతర వ్యాధులు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 1,706 వసతి గృహాల్లో పారిశుధ్య పరిస్థితులు బాగుండగా, మరో 442 వసతి గృహాల్లో బాగోలేదని గుర్తించారు. వైద్యారోగ్య సేవ‌ల‌కు అవ‌స‌ర‌మైన 31 ర‌కాల మందులు, ఇత‌ర అవ‌స‌రాల కోసం సుమారు రూ.75 కోట్లు వెచ్చించేందుకు వైద్యారోగ్యశాఖ నిర్ణ‌యించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్