గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్టోబర్ 1 మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ

2 గంటల క్రితం

pension
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 11:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 61.80 లక్షల మంది పింఛనుదారులకు అక్టోబ‌ర్ 1న‌ పింఛన్లు అంద‌జేసేందుకు ప్ర‌భుత్వం రూ.2,692.34 కోట్ల విడుదల చేసింద‌ని ఎంఎస్‌ఎంఇ, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం నుండి పంపిణీ జరుగుతుందని చెప్పారు.బ్యాంకు సెలవులు, సమ్మె కారణాల వల్ల పింఛన్ల పంపిణీ తేదీ, విధానంలో జరిగిన మార్పులను పింఛనుదారులందరూ గమనించి, పంపిణీ సిబ్బందికి సహకారం అందించాలని కోరారు.విడుదల చేసే మొత్తం నిధుల్లో రూ.2,675.63 కోట్లను సంబంధిత స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు పింఛను ఖాతాల్లో జమ చేస్తార‌ని, రూ.16.65 కోట్లను పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ (డిబిటి) ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ‌ఖాతాలకు జమ చేస్తారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఎన్‌ఎస్‌ఎ స్పర్ష్‌ విధానంలో ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో నేరుగా డిబిటి పద్దతిలో పింఛన్లను జమ చేసే ప్రక్రియను విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్న‌ట్టు వెల్లడించారు. ఇందుకోసం ఈ మండలంలోని ఎన్‌ఎస్‌ఎపి పింఛనుదారుల ఖాతాల్లో రూ.0.06 కోట్లు నేరుగా జమ కానున్న‌ట్టు తెలిపారు. సెప్టెంబర్ 26వ తేదీ శనివారం బ్యాంకు సెలవు కావడం, అలాగే సెప్టెంబర్ 28 నుంచి 30 తేదీ వరకూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్న నేపథ్యంలో పింఛనుదారులకు ఎలాంటి అవస్థలు కలగకుండా ప్రభుత్వం ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన‌ట్టు పేర్కొన్నారు. ఈ మేరకు వచ్చే నెల 1వ తేదీ ఉదయమే పింఛన్ల పంపిణీకి అవసరమైన నగదును విత్‌డ్రా చేసుకునేలా బ్యాంకులను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్