- ఆదివాసీ గిరిజన సంఘం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాతృభాష విద్యావాలంటీర్ల గౌరవ వేతనం పెంచాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ ఎన్ సరస్వతికి ఆ సంఘ అధ్యక్షుడు అరిక దుర్గారావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ అశోక్, సెక్రటరీ మాన్యం జిల్ల బి.నాగేశ్వరరావు మంగళవారం వినతీ పత్రం అందజేశారు. వాలంటీర్లకు మంజూరైన 10 నెలల బడ్జెట్ నిధులు రూ.7 కోట్లు పాడేరు, పార్వతీపురం,కెఆర్ పురం ఐటిడిఎ లో ఉత్తర్యులు పంపినట్లు సరస్వతి తెలిపారు. రెన్యువల్ చెయ్యడానికి చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ లకు ఆదేశాలు పంపినట్లు పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)