mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అరుదైన వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక పాలసీ

4 గంటల క్రితం

satya kumar yadav
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 09:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్య సేవలు అందించేలా కార్యాచరణ

వైద్య,ఆరగ్యో శాఖ మంత్రి సత్యకుమార్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అరుదైన వ్యాధులతో బాధపడే వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు, సదరు కుటుంబాలకు అండగా నిలిచేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ పాలసీని (విధానం) రూపొందించబోతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆర్ధికంగా, వైద్య సేవలపరంగా స్వాంత‌న‌ చేకూర్చే లక్ష్యంతో ఈ పాలసీ ఉండబోతుందని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జాతీయ అరుదైన వ్యాధుల విధానం-2021 (నేషనల్ పాలసీ ఫర్ రేర్ డీసీజెస్) అనుసరించి, అరుదైన వ్యాధుల చికిత్స కోసం రాష్ట్రస్థాయి రిజిస్ట్రీ ఏర్పాటు, వైద్యులకు ప్రత్యేక శిక్షణ, రిఫరల్ కేంద్రాల ఏర్పాటు వంటి గురించి పాలసీలో పొందుపరచనున్నామని తెలిపారు. అరుదైన వ్యాధులు ఉన్న వారికి ఉపశమనం కలిగించేలా ప్రభుత్వపరంగా వైద్య సేవలు, ఇతర సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో నూతన పాలసీ తయారీకి సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రధాన బోధనాసుపత్రులను అరుదైన వ్యాధుల నిర్ధారణ, చికిత్స కేంద్రాలుగా తయారుచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జాతీయ విధానం ప్రకారం అరుదైన వ్యాధులు 63 ఉన్నాయని, వీటిని మూడు విభాగాలుగా వర్గీకరించారని వివరించారు. గ్రూప్‌-1లో ఒకేసారి చికిత్సతో నయంచేయగల వ్యాధులు, గ్రూపు-2లో జీవితాంతం తక్కువ‌ వ్యయంతో చికిత్స అవసరమయ్యే వ్యాధులు,గ్రూపు-3లో అధిక వ్యయంతో నిరంతర చికిత్స అవసరమయ్యే వ్యాధులు ఉన్నాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 15 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఉన్నాయని, వీటిల్లో పేర్లు నమోదుచేసుకున్న వారిలో కేటగిరి-1, కేటగిరి-2లో పేర్కొన్న వ్యాధులతో బాధపడే వారికి చికిత్స కోసం ఒక్కొక్కరికి జీవితకాలం రూ. 50 లక్షల వరకు నిధులు కేంద్రం అందిస్తోందని వెల్లడించారు. కేటగిరి-3 వారికి వన్ టైం ఎయిడ్-క్రౌడ్ ఫండింగ్ కోసం సపోర్టింగ్ చేస్తోందని తెలిపారు. ​రిఫరల్ సెంటర్లుగా విశాఖ, తిరుపతి, విజయవాడ, కాకినాడ బోధనాసుపత్రులు సరిపోతాయని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్