సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు ప్రమాదంలో డిసిపి కుమార్తె దుర్మరణం

2 గంటల క్రితం

acident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 06:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులోని ఏటూకూరు రోడ్డు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్‌ ‌విభాగం డిప్యూటీ కమిషనర్‌ ‌షరీన్‌ ‌కుమార్తె షేక్‌ ఆసీఫా (24) మృతి చెందారు. ఆమె తండ్రి గతంలో వక్ఫ్‌ ‌బోర్డు ప్రత్యేక అధికారిగా పనిచేశారు. ఆదివారం సరదాగా తన స్నేహితులతో కలిసి విజయవాడ నుంచి చీరాల బీచ్‌‌కు కారులో ఆసీఫా వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏటూరు వద్ద బైపాస్‌‌లో మలుపు తిప్పుతుండగా ఎదురుగా వస్తున్న లారీ వీరి కారును ఢీకొంది. కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుంటూరులోని ఆదిత్య ఆస్ప్రతికి తీసుకువెళ్లగా ఆసీఫా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కుమార్తె మృతి వార్త విని డిసిపి షరీన్ బేగం తీవ్ర దిగ్భ్రాంతికి గురై స్పృహ కోల్పోయినట్లు సమాచారం. ఆసీఫా మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వస్థలమైన విజయవాడలోని రాజరాజేశ్వరి పేటకు తరలించారు. నల్లపాడు పోలీసులు లారీ డ్రైవర్‌‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్