శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజలు, పోలీసుల సంక్షేమమే లక్ష్యం

14 గంటల క్రితం

ప్రజలు, పోలీసుల సంక్షేమమే లక్ష్యం
- ఎపిఎస్‌‌పి, ఎస్‌‌సిటిపిసి పాసింగ్ అవుట్ పరేడ్‌‌లో మంత్రి సవితమ్మ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 08:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపిఎస్‌‌పి, ఎస్‌‌సిటిపిసి పాసింగ్ అవుట్ పరేడ్‌‌లో మంత్రి సవితమ్మ

​ప్రజాశక్తి-బుక్కరాయసమ్రుదం : టిడిపి కూటమి ప్రభుత్వం ప్రజలు, పోలీసుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఫ్రెండ్లీ పోలిసింగ్‌‌ను ప్రోత్సహిస్తోందని రాష్ర్ట బిసి వెల్ఫేర్, చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతులూరులోని 14వ బెటాలియన్‌‌లో ఎపిఎస్‌‌పి, ఎస్‌‌సిటిపిసి 2025-26 బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, 14వ బెటాలియన్ కమాండెంట్ ప్రభు కుమార్‌ ‌హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పోలీసు విధులను సమన్వయంతో నిర్వహించడం సవాల్‌‌తో కూడుకున్నదని చెప్పారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6,100 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. త్వరలో 2,050 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నామని చెప్పారు. అనంతరం శిక్షణలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనపరిచిన పోలీసులకు మంత్రి మొమెంటోలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ కేశవరెడ్డి, డిఎస్‌‌పి వెంకటశివారెడ్డి, ట్రైనింగ్ ఇన్‌ఛార్జి అసిస్టెంట్ కమాండెంట్ మహబూబ్ బాషా, శిక్షణార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్