శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అంబులెన్స్ ఆలస్యంతో ఆదివాసి బిడ్డ మృతి

19 గంటల క్రితం

girijana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 05:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మలేరియా జ్వరం అని నిర్ధారించిన వైద్యులు

- బాలిక మృతదేహంతో ఐటిడిఏ ముందు బాధితులు ఆందోళన

ప్రజాశక్తి చింతూరు : పోలవరం జిల్లా చింతూరు మండలం పెద్ద సత్తనపల్లి గ్రామానికి చెందిన పాపయ్య. సోడే సామమామ్మ అనే గిరిజన దంపతులకు చెందిన నాలుగు సంవత్సరముల వయస్సు గల లాస్య అనే శుక్రవారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధితుల కథనం ప్రకారం జ్వరంతో బాధపడుతున్న సోడియం లాస్య పాపను తల్లిదండ్రులు చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఉదయం 10 గంటలకు తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించారు. పాపకు మలేరియా జ్వరం ఉందని వైద్యులు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో పరిస్థితి విషమంగా ఉందని భద్రాచలం ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పడంతో అంబులెన్స్ కు ఫోన్ చేయగా అందుబాటులో లేకపోవడంతో ఐటిడిఏ అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడం జరిగింది. అంబులెన్స్ ఆసుపత్రికి వచ్చింది. కానీ అంబులెన్స్లో డీజిల్ లేదని డీజిల్ పోయవలసిందిగా డ్రైవర్ చెప్పడం జరిగింది. దానికి బాధితులు లేవని చెప్పారు. ఈ సతంగమంతా జరగటంతో మధ్యాహ్నం రెండున్నర గంటలు అయింది. అప్పటికే ఆలస్యం జరగడంతో పాప పరిస్థితి విషమించి చికిత్సలు నిర్వహిస్తుండగానే మృతి చెందింది. అనంతరం పాప మృతదేహాన్ని తీసుకొని బాధితులు ఐటిడిఏ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టినారు. ఆసుపత్రిలో అంబులెన్స్లను అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉంచాలని. ఆదివాసీలకు ఐటిడిఏ అన్ని రకాల సేవలు అందించాలని ఇటువంటిది పునరావృతం కాకుండా అంబులెన్స్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్