- సుప్రీంకు తెలిపిన యుపి ప్రభుత్వం
- 105 సార్లు చోరీ చేశారని వెల్లడి
న్యూఢిల్లీ : అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో ఈ నెల 15లోగా ఛార్జీషీట్ దాఖలు చేస్తామని సుప్రీంకోర్టుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సోమవారం తెలిపింది. సోమవారం విచారణలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు ‘‘దాదాపుగా పూర్తయిందని’’, ఛార్జ్‌షీట్‌ను సంబంధిత అదనపు సెషన్స్ జడ్జి కోర్టులో ఈ నెల 25 లోగా లేదా అంతకు ముందే దాఖలు చేస్తామని చెప్పారు. ఈ కేసులో మొదటి అరెస్టుతో ప్రారంభమైన 90 రోజుల చట్టబద్ధమైన దర్యాప్తు గడువు ఈ నెల 25తో ముగుస్తుందని, కాబట్టి ఈ లోగా ఛార్జీషీట్ దాఖలు చేయకపోతే, తద్వారా నిందితులు ‘డిఫాల్ట్ బెయిల్’ (చట్టపరమైన గడువులోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడం వల్ల లభించే బెయిల్) పొందేందుకు అర్హులవుతారని మెహతా గుర్తు చేశారు. దీనికి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ సెషన్స్ కోర్టు పరిధిలో జోక్యం చేసుకోవాలని తాము కోరుకోవడం లేదని, అయితే ఛార్జ్‌షీట్ కాపీని అత్యున్నత న్యాయస్థానంలో కూడా దాఖలు చేయాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వరుసగా విరాళాలు చోరీ..
సోమవారం విచారణలో యుపి ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టు పరిశీలించింది. ఈ రిపోర్టు ప్రకారం ఏకంగా రామమందిర విరాళాల చోరీ ఏకంగా 105 సార్లు జరిగింది. సిసిటివిలో నమోదైన దృశ్యాల ఆధారంగా 105 సార్లు చోరీ ఘటనలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. అలాగే, చోరికి పాల్పడిన వారందర్నీ కూడా గుర్తించింది. ఈ విషయాన్ని తన ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు వెల్లడించింది. స్టేటస్ రిపోర్టులో వివరాలను ధర్మసనం చదవి వినిపించింది. అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు విచారణ కోసం ఈ ఏడాది జూన్ 13న లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది.
అలాగే, ఈ చోరీపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని సోమవారం విచారించింది. అలాగే, దర్యాప్తు వివరాలకు సంబంధించిన కాపీలను తమకు కూడా ఇవ్వాలని పిటిషనర్లు కోరగా సుప్రీంకోర్టు వాటిని తిరస్కరించింది.







కామెంట్‌లు (0)