ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సమగ్రశిక్ష ఎస్‌‌పిడికి ఇండియన్‌ హ్యూమానిటేరియన్‌ అవార్డు

30 సెప్టెంబర్, 2026

సమగ్రశిక్ష ఎస్‌‌పిడికి ఇండియన్‌ హ్యూమానిటేరియన్‌ అవార్డు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 11:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టరు ‌బి శ్రీనివాసరావుకు ఇండియన్‌ ‌బుక్‌ ఆఫ్‌ ‌రికార్డ్సు ‘ఇండియన్‌ ‌హ్యూమానిటేరియన్‌ అవార్డు’ను ప్రదానం చేసింది. ​రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం సమగ్రశిక్ష ద్వారా చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, సమాన విద్యావకాశాల కల్పన, వారి సాధికారతకు చేసిన కృషికి గుర్తింపుగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ తులసీరామ్ బుధవారం ఈ అవార్డును విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయంలో అందించారు. ఈ అవార్డులో ‘ప్రాజెక్ట్ దృష్టి’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన 21 మంది విద్యార్థులు మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను విజయవంతంగా చేరుకున్నారని తెలిపారు. పారా స్పోర్ట్స్, ఇంక్లూజివ్ స్పోర్ట్స్ లోనూ తగిన ప్రోత్సాహం, సహకారం, సమాన అవకాశాలు కల్పిస్తే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను సాధించగలరనే స్ఫూర్తిని ఈ కార్యక్రమం అందించిందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ పురస్కారం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సేవలో అంకితభావంతో పనిచేస్తున్న సమగ్ర శిక్ష బృంద సభ్యులకు, ఆయా పిల్లల తల్లిదండ్రులకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి సమగ్ర, సమాన విద్యావకాశాలు కల్పించేందుకు మరింత కృషి చేస్తామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్