హైదరాబాద్ : మల్కాజ్‌గిరి పరిధిలో బుధవారం తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో ఉషారాణి అనే మహిళను ఆమె భర్త అరుణ్ తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యాభర్తలైన అరుణ్, ఉషారాణిల మధ్య గత కొంతకాలంగా తీవ్ర వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున గొడవల గురించి మాట్లాడుకుందామని చెప్పి అరుణ్ తన భార్య దగ్గరకు వచ్చాడు. అయితే, ఒంటరిగా కాకుండా తనతో పాటు మరో వ్యక్తిని కూడా వెంటబెట్టుకుని వచ్చాడు. మాటల మధ్యలో వివాదం ముదరడంతో, అరుణ్ తన వద్ద ఉన్న తుపాకీ తీసి ఉషారాణిపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉషారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు, పరారీలో ఉన్న నిందితుడు అరుణ్ మరియు అతనికి సహకరించిన మరో వ్యక్తి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
మల్కాజ్‌గిరిలో కాల్పుల కలకలం: భార్యను కాల్చి చంపిన భర్త
10 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 10, 2026, 10:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)