గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు - కారు ఢీ, నలుగురు మృతి

4 రోజుల క్రితం

road acident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 06:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిట్యాల: నల్గొండ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం అత్యవసరంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్