ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పురపోరులో కూటమి ఏకగ్రీవాల జోరు

6 రోజుల క్రితం

Alliance sweeps unanimous wins in civic polls
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 09:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : స్థానిక ఎన్నికల పోరులో కూటమి జోరు చూపిస్తోంది. 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు.. మొత్తం 100 పట్టణ స్థానిక స్థానాల్లో జరుగుతున్న ఎన్నికల్లో 16 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో 14 మంది టిడిపి కి చెందినవారు కాగా, జనసేన, బిజెపి నుంచి చెరొకరు ఎన్నికయ్యారు. 639 వార్డులు, డివిజన్లనూ కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. అలాగే ఆదివారం నాటికి 4 జడ్పీటీసీలు, 32 ఎంపీటీసీ స్థానాలు కూడా కూటమి ఏకగ్రీవ ఖాతాలో పడ్డాయి. వైసిపి సైతం 10 పట్టణ వార్డులు, 7 ఎంపీటీసీ స్థానాలను పోటీలేకుండా దక్కించుకుంది. పుంగనూరు, రాయచోటి, రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, కమలాపురం, ఆళ్లగడ్డ, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, ఆత్మకూరు, గుత్తి, కనిగిరి మున్సిపాలిటీలు టిడిపి కి దక్కగా, దర్శిలో జనసేన, ఎర్రగుంట్లలో బిజెపి చైర్మన్‌ అభ్యర్థులు ఎన్నికయ్యారు. రాయలసీమలో అత్యధికంగా 11 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. పల్నాడు జిల్లాలో 3, ఉమ్మడి ప్రకాశంలో రెండు ఏకగ్రీవమయ్యాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్