మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition1న కరువు మండలాల ప్రకటన

1 గంట క్రితం

Atchannaidu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 09:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి_ఒంగోలు కలెక్టరేట్ : కరువు ప్రాంతాలు, కరువు మండలాలను అక్టోబర్ ఒకటో తేదీన అధికారికంగా ప్రకటిస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఆధునీకరించిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని మంగళవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వాణిజ్య బ్యాంకులకు ఏమాత్రం తీసిపోని విధంగా కో-ఆపరేటివ్ బ్యాంకులను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయడం ద్వారా పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతాంగం తీవ్ర కరువును ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే నెల ఒకటో తేదీ నాటికి కరువు ప్రాంతాలు, కరువు మండలాలను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా లోగోను మంత్రులు అచ్చె నాయుడు, డిబివి స్వామి, ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్