ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : హైదరాబాద్ మాదాపూర్ సిద్దిక్‌నగర్‌లోని ఓయో హోటల్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నానికి చెందిన ప్రయివేటు ఉద్యోగిని షారోన్ నిఖితా టోప్నో (29) తన స్నేహితుడు శ్రీనివాస రవితేజతో కలిసి సోమవారం మాదాపూర్ రోడ్‌లోని ఓయో హోటల్‌లో అద్దెకు రూమ్ తీసుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో నిఖితా అపస్మారక స్థితిలోకి వెళ్లిందని రవితేజ హోటల్ సిబ్బందికి చెప్పారు. వారి సహాయంతో ఆమెను కాకతీయ ఆస్పత్రికి, అక్కడ నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. ఆస్పత్రి నుంచి సమాచారం అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ముఖంపై స్వల్ప గాయాల గుర్తులు కనిపించడంతో పాటు హోటల్ గది గోడలు, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఘటనాస్థలాన్ని పరిశీలించి రక్తపు నమూనాలను సేకరించారు. ఘటన అనంతరం రవితేజ ఆస్పత్రి నుంచి అదృశ్యమవడం, అతని ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో పోలీసులు ఆయన కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హోటల్ సిసి కెమెరా దృశ్యాలు, రిజిస్టర్, సిబ్బంది వాంగ్మూలాలను సేకరిస్తున్నారు.
Print Editionహైదరాబాద్ హోటల్‌లో విశాఖ యువతి అనుమానాస్పద మృతి
52 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 10:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)