ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్ : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరంలోని హార్లిక్స్ ఫ్యాక్టరీలో మంగళవారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో హెచ్‌యుఎల్ ఐక్య ఫ్రంట్ ఘన విజయం సాధించింది. హెచ్‌యుఎల్ వర్కర్స్ యూనియన్, సిఐటియు, ఐఎన్‌టియుసి, జిఎస్‌కె వర్కర్స్ యూనియన్ తదితర సంఘాలతో ఏర్పడిన ఐక్య ఫ్రంట్‌కు కార్మికులు జై కొట్టారు. మొత్తం 886 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో ఒక్క ఓటు చెల్లలేదు. హెచ్‌యుఎల్ ఐక్య ఫ్రంట్‌కు 493 ఓట్లు లభించగా, గోదావరి జిఎస్‌కె వర్కర్స్ యూనియన్, ఐఎన్‌టియుసి చీలిక వర్గం, చైతన్య యూనియన్ కలిసి పోటీ చేసిన ప్రత్యర్థి వర్గానికి 388 ఓట్లు వచ్చాయి. దీంతో ఐక్య ఫ్రంట్ 105 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా సిఐటియు గౌరవ అధ్యక్షులు టి అరుణ్, హెచ్ యుఎల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తమ్మారెడ్డి వేణు ప్రతాప్ మాట్లాడుతూ హార్లిక్స్ పరిశ్రమలో కార్మికుల వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమం, వైద్య సదుపాయాలు, ఇతర హక్కులపై పోరాడతామన్నారు. వివిధ కార్మిక సంఘాలు విడిగా కాకుండా ఐక్యంగా బరిలోకి దిగడంవల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. సమస్యలపై జరిగే పోరాటాలకు ఇదే ఐక్యతను చాటాలన్నారు.
Print Editionహార్లిక్స్ ఫ్యాక్టరీ గుర్తింపు ఎన్నికల్లో హెచ్‌యుఎల్ ఐక్య ఫ్రంట్ విజయం
55 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 10:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)