ప్రజాశక్తి -తిరుమల : తిరుమల కాలి నడక మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో ఓ చెట్టుపై చిరుతను చూసిన శ్రీవారి యాత్రికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే టిటిడి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీ శాఖ అధికారులు వచ్చి అక్కడ పరిస్థితిని సమీక్షించారు. రాత్రి వేళ వచ్చే చిరుత ఉదయం పూట కనిపించడంతో ఈ ప్రదేశంలో ఎన్ని చిరుతలున్నాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. తరచూ ఏడో మైలు నుంచి నరసింహస్వామి ఆలయం మధ్య ప్రాంతంలో చిరుత సంచారం ఉందని అటవీ అధికారులు గుర్తించారు. మంగళవారం ఉదయం 2800వ మెట్టు దగ్గర చిరుత పులి కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాత్రి వేళ కాలినడకన యాత్రికులను అనుమతించబోమని అధికారులు తెలిపారు.
Print Editionఅలిపిరి నడక మార్గంలో చెట్టుపై చిరుత
52 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 10:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)