అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కార్యాచరణ షెడ్యూల్‌ను విడుదల చేసింది. విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక తేదీలు, మార్గదర్శకాలను కమిషన్ ప్రకటించింది.
ఎన్నికల కీలక తేదీలు ....
సెప్టెంబరు 7 : ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ
సెప్టెంబరు 20 : అభ్యంతరాలు/క్లెయిమ్‌ల దాఖలుకు తుది గడువు
సెప్టెంబరు 23 : అభ్యంతరాల పరిష్కారం
సెప్టెంబరు 28 : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటీసు జారీ
అక్టోబరు 11 : నామినేషన్ల దాఖలు
అక్టోబరు 14 : నామినేషన్ల పరిశీలన
అక్టోబరు 19 : పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా వెల్లడి
అక్టోబరు 28 : పోలింగ్ మరియు పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
నవంబరు 1 : వార్డు సభ్యుల ఎన్నిక
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నీ పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది.








కామెంట్‌లు (0)