విశాఖపట్నం–కాకినాడ పోర్టు రైళ్ల రాకపోకలపైనా ప్రభావం
ప్రజాశక్తి - సామర్లకోట (కాకినాడ) : అర్నాబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో మంగళ, బుధ వారాల్లో వివిధ మార్గాల్లో నడవాల్సిన మొత్తం 53 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే ప్రకటించింది. దీంతో విజయవాడ, రాజమండ్రి, కాకినాడ పోర్టు, విశాఖపట్నం, పార్వతీపురం, నరసాపురం, మచిలీపట్నం, భీమవరం, గుంటూరు తదితర ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అక్టోబర్ 27, 28 తేదీల్లో రద్దయిన రైళ్లు
1. 67261 – రాజమండ్రి నుంచి విజయవాడ
2. 67263 – విజయవాడ నుంచి మచిలీపట్నం
3. 67264 – మచిలీపట్నం నుంచి విజయవాడ
4. 67265 – విజయవాడ నుంచి మచిలీపట్నం
5. 67271 – మచిలీపట్నం నుంచి గుడివాడ
6. 67272 – గుడివాడ నుంచి మచిలీపట్నం
7. 67252 – మచిలీపట్నం నుంచి గుడివాడ
8. 67253 – గుడివాడ నుంచి మచిలీపట్నం
9. 67254 – మచిలీపట్నం నుంచి గుడివాడ
10. 67255 – గుడివాడ నుంచి మచిలీపట్నం
11. 67256 – మచిలీపట్నం నుంచి విజయవాడ
12. 17267 – కాకినాడ పోర్టు నుంచి విశాఖపట్నం
13. 17268 – విశాఖపట్నం నుంచి కాకినాడ పోర్టు
14. 07267 – పార్వతీపురం నుంచి విశాఖపట్నం
15. 07268 – విశాఖపట్నం నుంచి పార్వతీపురం
అక్టోబర్ 27న రద్దయిన రైళ్లు
1. 67258 – విజయవాడ నుంచి నరసాపురం
2. 67246 – నరసాపురం నుంచి రాజమండ్రి
3. 17269 – విజయవాడ నుంచి నరసాపురం
4. 17264 – నరసాపురం నుంచి భీమవరం జంక్షన్
5. 67257 – విజయవాడ నుంచి నరసాపురం
6. 17257 – విజయవాడ నుంచి కాకినాడ పోర్టు
7. 67202 – విజయవాడ నుంచి రాజమండ్రి
8. 67267 – విజయవాడ నుంచి మచిలీపట్నం
9. 67247 – నరసాపురం నుంచి గుంటూరు జంక్షన్
10. 67276 – నరసాపురం నుంచి విజయవాడ
11. 67301 – రాజమండ్రి నుంచి కాకినాడ పోర్టు
12. 67285 – రాజమండ్రి నుంచి విశాఖపట్నం
13. 67286 – విశాఖపట్నం నుంచి రాజమండ్రి
అక్టోబర్ 28న రద్దయిన రైళ్లు
1. 67266 – మచిలీపట్నం నుంచి విజయవాడ
2. 67275 – విజయవాడ నుంచి భీమవరం జంక్షన్
3. 67277 – భీమవరం జంక్షన్ నుంచి నిడదవోలు జంక్షన్
4. 67278 – నిడదవోలు జంక్షన్ నుంచి భీమవరం జంక్షన్
5. 67244 – నరసాపురం నుంచి నిడదవోలు జంక్షన్
6. 67245 – నిడదవోలు జంక్షన్ నుంచి నరసాపురం
7. 17270 – నరసాపురం నుంచి విజయవాడ
8. 67268 – మచిలీపట్నం నుంచి విజయవాడ
9. 67249 – గుంటూరు జంక్షన్ నుంచి రేపల్లె
10. 67250 – రేపల్లె నుంచి గుంటూరు జంక్షన్
11. 67248 – గుంటూరు జంక్షన్ నుంచి విజయవాడ
12. 67269 – విజయవాడ నుంచి మచిలీపట్నం
13. 67270 – మచిలీపట్నం నుంచి విజయవాడ
14. 67281 – విజయవాడ నుంచి భీమవరం జంక్షన్
15. 67283 – భీమవరం జంక్షన్ నుంచి నిడదవోలు జంక్షన్
16. 67284 – నిడదవోలు జంక్షన్ నుంచి భీమవరం జంక్షన్
17. 67282 – భీమవరం జంక్షన్ నుంచి విజయవాడ
18. 67262 – విజయవాడ నుంచి రాజమండ్రి
19. 67302 – కాకినాడ పోర్టు నుంచి రాజమండ్రి
20. 17258 – కాకినాడ పోర్టు నుంచి విజయవాడ
21. 67229 – విజయవాడ నుంచి గుంటూరు జంక్షన్
22. 67223 – గుంటూరు జంక్షన్ నుంచి రేపల్లె
23. 67224 – రేపల్లె నుంచి తెనాలి జంక్షన్
24. 67222 – తెనాలి జంక్షన్ నుంచి విజయవాడ
25. 67251 – భీమవరం జంక్షన్ నుంచి మచిలీపట్నం
ప్రయాణికులకు సూచన
రైళ్ల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున, ప్రయాణానికి ముందుగా తమ రైలు నంబరు, ప్రయాణ తేదీని పరిశీలించి, అధికారిక రైల్వే విచారణ కేంద్రాలు లేదా రైల్వే అధికారిక సమాచార వేదికల ద్వారా తాజా వివరాలను నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు. రైళ్ల రద్దు కారణంగా ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేసింది








కామెంట్‌లు (0)