అక్టోబర్ 30న పెన్షన్ల పంపిణీ – మిగిలిన పెన్షన్లు నవంబర్ 4, 5 తేదీల్లో పంపిణీ
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి) : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి దృష్ట్యా లబ్ధిదారులకు రెండు రోజులు ముందుగానే పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతితో అక్టోబర్ 30వ తేదీన పెన్షన్ల పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆ రోజున పంపిణీ కాకుండా మిగిలిపోయిన పెన్షన్లను నవంబర్ 4, 5 తేదీల్లో పంపిణీ చేయడం జరుగుతుందనున్నారు. పెన్షన్ల పంపిణీ తేదీల్లో ఈ మార్పును లబ్ధిదారులు గమనించగవలసినదిగా కోరారు.
పెన్షన్ల పంపిణీ తేదీలు ....
- 30 అక్టోబర్ 2026: అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీ.
- 4, 5 నవంబర్ 2026: మిగిలిన పెన్షన్ల పంపిణీస్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ షెడ్యూల్ మార్పు










కామెంట్లు (0)