గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోటప్పకొండలో తారస్థాయికి చేరిన అర్చకుల వివాదం

1 గంట క్రితం

Dispute among priests reaches a peak at Kotappakonda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 01:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అర్హత లేనివారికి ఉద్యోగాలిచ్చారంటూ ఆరోపణలు

ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలంటూ అర్చకుల డిమాండ్‌...


ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండలో అర్చకుల మధ్య గురువారం వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఆలయంలో అర్హతలు లేని వారికి లంచాలు తీసుకుని ఉద్యోగ అవకాశాలు కల్పించారంటూ ఒక వర్గం అర్చకులు ఆరోపిస్తున్నారు. దేవదాయ శాఖ ఉన్నతాధికారుల వరకు లంచాలు చెల్లించి అర్చక పోస్టులు పొందినట్లు కొందరు బహిరంగంగా చెబుతున్నారని వారు తెలిపారు. తమ విధులకు ఆటంకాలు కలిగిస్తూ, సక్రమంగా విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా జోక్యం చేసుకోకపోతే ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ ఉన్నతాధికారులు వివాదం పై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్చకులు ఆలయ ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్