న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడంతోపాటు ఓట్ల చోరీని అడ్డుకునేందుకు నవంబర్ 1న నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ రామ్‌లీలా మార్చ్’లో ప్రజలంతా పాల్గొనాలని కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురువారం పిలుపునిచ్చారు. ఈ మార్చ్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేపడుతున్న ఉద్యమమని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తీరుతో విసిగిపోయిన వారంతా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. పోలీసులు, లాఠీచార్జీలకు భయపడకుండా రాజ్యాంగ పరిరక్షణ కోసం ముందుకు రావాలని రాహుల్ గాంధీ సూచించారు. అలాగే రాజకీయ విభేదాలను పక్కనపెట్టి విద్యార్థి సంఘాలన్నీ ఈ మార్చ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశం, ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఆలోచనలు, దృక్పథాలు ప్రమాదంలో ఉన్నాయని భావించేవారంతా తమతో కలిసి రావాలని కోరారు. దేశ ఆత్మను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే ఈ యాత్రను నిర్వహిస్తున్నామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ‘చలో ఢిల్లీ మార్చ్’ : రాహుల్‌గాంధీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 29, 2026, 01:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)