శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల వేళ .. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్ర చర్యలు : ఎస్ఇసి

1 గంట క్రితం

Strict action will be taken if peace and order are disrupted during the election period: SEC
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 12:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : ' రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేళ ... శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్ర చర్యలు ఉంటాయి ` అని ఎపి ఎస్ఇసి అనిల్ చంద్ర పునేఠ హెచ్చరించారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఇసి మాట్లాడుతూ .... శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్ర చర్యలు ఉంటాయన్నారు. హింసాత్మక ఘటనలు జరిగితే అదనపు బలగాలను మోహరిస్తామని తెలిపారు. నామినేషన్‌ వేసేందుకు అభ్యర్థితో కలిపి ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి నామినేషన్‌ సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. నామినేషన్ల వేళ అధికారుల నిర్లక్ష్యం ఉంటే.. బదిలీ లేదా సస్పెండ్‌ చేస్తాం అని ఎస్ఇసి హెచ్చరించారు.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్