ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నందలూరులో ఉద్రిక్తత.. టిడిపి రెండు వర్గాలు రాళ్ల దాడి

22 అక్టోబర్, 2026

Tension in Nandaluru; stone-pelting between two TDP factions
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 03:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాజంపేట (కడప) : కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడిపి లోని రెండు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో కారు, రెండు బైక్ లు ధ్వంసం కాగా, మరో కారుకు దుండగులు నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు టిడిపి అధికార ప్రతినిధి బాలసుబ్రమణ్యం గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. నందలూరులో బాలసుబ్రమణ్యం, విజయసాగర్‌ వర్గీయుల మధ్య ఈ ఘర్షణ రాజుకుంది. తమ అభ్యర్థులే నామినేషన్‌ వేయాలని రెండు వర్గాలు భీష్మించుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాల వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్‌ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్