బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

3 మండలాలు మినహా అన్నిచోట్లా పరిషత్‌ ఎన్నికలు : ఎస్ఇసి

1 గంట క్రితం

Zilla Parishad and Mandal Parishad elections to be held everywhere except in 3 mandals SEC
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 12:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : ఎపి లో పరిషత్‌ ఎన్నికలు మూడు మండలాలు మినహా మిగతాచోట్ల యథావిధిగా జరగనున్నాయి. పలుచోట్ల ‘మురసు’ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఇసి అనిల్‌ చంద్రపునేఠా జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముందుగా రాష్ట్రంలో వర్షాలు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై వివరాలను తెలుసుకున్నారు. వర్షాలు తగ్గాయని ఎక్కువ మంది కలెక్టర్లు ఎస్‌ఇసి కి తెలిపారు. పరిమిత సంఖ్యలో మినహా మిగిలిన చోట్ల పోలింగ్‌కు ఇబ్బంది లేదని చెప్పారు. నవంబర్‌ 5 న ప్రశాంతంగా ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు చర్యలకు తీసుకోవాలని ఎస్‌ఇసి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులుంటే క్షేత్రస్థాయి నుంచి కలెక్టర్ల నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా .... గుంటూరు జిల్లాలోని 3 మండలాల్లో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు వాయిదా పడ్డాయి. పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ ప్రకటించారు. వర్షాలు, వరదల కారణంగా ఆయా ప్రాంతాలకు ఎన్నికల సామగ్రి తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్