బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

హెచ్-1బి వీసాలపై 1 లక్ష డాలర్ల ఫీజు - ట్రంప్ కు కోర్టు బిగ్ షాక్ ..!

4 రోజుల క్రితం

$100,000 fee on H-1B visas – Big court setback for Trump!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 11:02 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

అమెరికా : అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని అమెరికా కోర్టు తోసిపుచ్చింది. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు జారీ చేసే కొత్త హెచ్-1బి వీసాలపై 1 లక్ష డాలర్ల ఫీజు విధించాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదనకు అమెరికా అప్పీల్స్ కోర్టు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది.

ఈ ఫీజు చట్టవిరుద్ధమైన పన్నుగా పేర్కొంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్స్ కోర్టు యథాతథంగా కొనసాగించింది. దీంతో ఈ భారీ ఫీజు అమలుకు మరోసారి బ్రేక్ పడింది. ఈ తీర్పు హెచ్-1 బి వీసాలపై ఆధారపడే కంపెనీలు, నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు ఊరటనిచ్చేలా భావిస్తున్నారు. వలస విధానాలకు సంబంధించిన కీలక నిర్ణయాలపై న్యాయస్థానాల పర్యవేక్షణ కొనసాగుతుందనే సంకేతాన్ని కూడా ఈ తీర్పు ఇచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ఫీజును అమలు చేయాలంటే కొత్త చట్టపరమైన ప్రక్రియ లేదా శాసనసభ ఆమోదం అవసరమయ్యే అవకాశం ఉంది.


అమెరికా ఏటా 65,000 H-1B వీసాలను, అలాగే ఉన్నత విద్యా అర్హతలు కలిగిన విదేశీ కార్మికుల కోసం అదనంగా 20,000 వీసాలను జారీ చేస్తుంది. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికుల H-1B వీసాలపై 1,00,000 డాలర్ల రుసుము విధించాలన్న ట్రంప్ పరిపాలన నిర్ణయాన్ని రద్దు చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించడానికి అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు నిరాకరించింది. బోస్టన్ కేంద్రంగా పనిచేసే ‘ఫస్ట్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్’లోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం, ఈ రుసుమును చట్ట విరుద్ధమైన పన్నుగా (కాంగ్రెస్ ఆమోదం లేనిదిగా) పేర్కొంటూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి లియో టి.సోరోకిన్ జూన్ 8న ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలన్న ఫెడరల్ ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ కోర్టులో అప్పీల్ పెండింగ్‌లో ఉన్న సమయంలో, డిస్ట్రిక్ట్ కోర్టు జూన్ 8 నాటి మెమోరాండం, ఉత్తర్వు , తీర్పులపై స్టే విధించాలన్న ప్రతివాదుల అభ్యర్థనను తాము తిరస్కరిస్తున్నామ‌ని ధర్మాసనం సంచ‌ల‌న తీర్పునిచ్చింది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, కాంగ్రెస్ సంబంధిత అధికారాన్ని బదిలీ చేయవచ్చా లేదా అనేది కాదు. అసలు కాంగ్రెస్ అలా చేసిందా లేదా అన్నదే ముఖ్యం అని వాదించిన పిటిషనర్లతో (డెమోక్రాట్ పాలనలోని 20 రాష్ట్రాలు) న్యాయమూర్తులు ఏకీభవించారు. కొత్త H-1B వీసాల జారీకి 1,00,000 డాలర్ల రుసుము విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది సెప్టెంబరులో ఒక ప్రకటన జారీ చేశారు. H-1B వీసా అనేది ఒక ‘నాన్-ఇమ్మిగ్రెంట్’ (శాశ్వత నివాస హోదా లేని) వీస. ఇది సిద్ధాంత పరమైన లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ కార్మికులను నియమించుకోవడానికి అమెరికా కంపెనీలకు అనుమతినిస్తుంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్